● మహిళ భర్తపై
దాడికి పాల్పడ్డ యువకుడు
● అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
సిద్దిపేటకమాన్: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు ఆమె భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. ఐల శ్రీధర్, భార్య ఇద్దరు పిల్లలతో కలిసి గుండ్ల చెరువులో నివాసం ఉంటున్నాడు. శ్రీధర్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మెరుగు శ్రావణ్ (21) సదరు మహిళతో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనికి గాను అడ్డు తొలగించుకోవాలని శ్రవణ్‌తో కలిసి భర్త శ్రీధర్‌ను చంపడానికి పథకం వేసింది భార్య. గత నెల 11న రాత్రి పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న శ్రీధర్‌ను శ్రావణ్ లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ బైక్‌పై వెళ్తున్న క్రమంలో నర్సాపూర్ చౌరస్తా సమీపంలో యువకుడి ఇద్దరు స్నేహితులు వీరి వెనుకాలే వచ్చారు. ముగ్గురూ కలిసి శ్రీధర్‌ను కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేశారు. మళ్లీ రెండోసారి గత నెల 20న శ్రీధర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 12న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రధాన నిందితుడు మెరుగు శ్రావణ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment