చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
టేక్మాల్(మెదక్): చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొడ్మట్‌పల్లిలో సోమ వారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ దయానంద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చీలపల్లి లక్ష్మయ్య(59) రజక వృత్తితోపాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా చేపలు పట్టేందుకు వాగుల్లోకి, కుంటల్లోకి వెళ్లేవాడు. 14న ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, వ్యవసాయ పొలాల వద్ద వెతుకుతుండగా 17న రాత్రి గుండువాగు గడ్డపై లక్ష్మయ్య బట్టలు, సెల్‌ఫోన్, చెప్పులు కనిపించాయి. వాగులోకి పరిశీలించి చూడగా లక్ష్మయ్య మృతదేహం కనిపించింది. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య చీలపల్లి పోచమ్మ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ యువకుడు
పుల్‌కల్(అందోల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పుల్‌కల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీస్‌ల కథనం మేరకు.. పుల్‌కల్ గ్రామానికి చెందిన బోయిని నవీన్ (25) సోమవారం రాత్రి కడుపునొప్పి భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పుల్‌కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment