కేసీఆర్‌ను కలిసిన జెడ్పీ మాజీ చైర్మన్
సంగారెడ్డి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య కలిశారు. కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య ఉన్నారు.
జీవితాలు నాశనం చేసుకోవద్దు
భరోసా కేంద్రం ఇన్‌చార్జి మహేశ్వరి
జోగిపేట(అందోల్): విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పేది ఇంటర్మీడియేట్ అని.. ఈ రెండు సంవత్సరాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచి భవిష్యత్‌ను పొందవచ్చని సంగారెడ్డి పోలీసుశాఖ భరోసా కేంద్రం ఇన్‌చార్జి మహేశ్వరి అన్నారు. మంగళవారం జోగిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులకు సెల్‌ఫోన్ల వినియోగం వల్ల కలిగే లాభాలు, నష్టాలను వివరించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నేరాలు ప్రతిరోజు పత్రికలు, టీవీల్లో చూస్తున్నారని, అందుకు విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్ గేమింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్లు కల్పించాలి
ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు
సంగారెడ్డి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా తమిళనాడు తరహాలో చట్టబద్ధత కల్పించాలని ఓబీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తీర్మానం ద్వారానే చట్టబద్ధత కలుగుతుందని , విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో ఆర్టికల్ 9 ప్రకారం చట్టబద్ధత కల్పించాలన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి తీరని అన్యాయం చేసిందని, ఈ ప్రభుత్వమైనా బీసీలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, యువత జిల్లా అధ్యక్షులు జి.రమేష్ కుమార్, జిల్లా యువత నాయకులు నిఖిల్, కార్తీక్, కురువ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య తదితరులు ఉన్నారు.
పంచాయతీ కార్యదర్శిపై వేటు
కంది (సంగారెడ్డి): కంది మండల పరిధిలోని తుంకిల్ల తండా పంచాయతీ కార్యదర్శి రేఖను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సదాశివపేట మండలం వెల్లూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఆమె పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు అందాయి. విచారణలో నిజమని తేలడంతో కలెక్టర్ వేటు వేశారు.
కేసీఆర్‌ను కలిసిన జెడ్పీ మాజీ చైర్మన్
కేసీఆర్‌ను కలిసిన జెడ్పీ మాజీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment