అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఘటన
పటాన్‌చెరు టౌన్: అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి (34) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య గర్భిణి కావడంతో పుట్టింటి వద్ద ఉంటుంది. కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధ తాళలేక సోమ వారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వాసవి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి సమీపంలో ఉన్న ఆమె చెల్లెలు సాయి చందనకు ఫోన్ చేసి చెప్పింది. వెంట నే ఆమె ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూడగా బావ శ్రీనివాస్ రెడ్డి ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి మరదలు సాయి చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ దుర్గయ్య కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment