
చేపల వేటకు వెళ్లి వ్యక్తి
శివ్వంపేట(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బిజ్లిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నెల్లూరి సాయికుమార్(35) శనివారం రాత్రి మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం గ్రామ పరిసరాల్లోని చెరువులు, కుంటల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమ వారం గ్రామ శివారులోని వీరప్ప చెరువు లో సాయికుమార్ మృతదేహం తేలడంతో గుర్తించా రు. చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు మృతుడి చెల్లి శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment