మిత్రుడి వివాహానికి వచ్చి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువ
మరో యువకుడికి తీవ్ర గాయాలు
నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ లింగం కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాయి నిఖిల్(21), అతడి మిత్రుడు మనీశ్ ఆదివారం మెదక్‌లో జరిగిన వారి మిత్రుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇంటికి తిరిగి ప్రయణమయ్యారు. నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా నర్సాపూర్ శివారులోని అయ్యప్ప దేవాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌కు బైక్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మనీశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించారు. బైక్‌ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపినందునే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
బైక్ ఢీకొని వృద్ధుడు
కొండపాక(గజ్వేల్): బైక్ ఢీకొట్టడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన కొండపాకలో చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామానికి చెందిన తోడేటి పెంటయ్య(60) సమీప గ్రామమైన మేదినీపూర్‌లో జరిగిన వివాహానికి హాజరయ్యాడు. సాయంత్రం వేళ కొండపాకలోని అత్తారింటికి నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తున్న బైక్ తిమ్మారెడ్డిపల్లి శివారులో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కోరుట్లకు చెందిన వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment