వ్యక్తి కేసు నమోదు
నర్సాపూర్: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మూసాపేట గ్రామానికి చెందిన ప్రవీన్ 100 నబంర్‌కు ఫోన్ చేసి తన అక్క రేణుకను బావ సురేశ్ కొడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు మోహన్, భిక్షపతి గ్రామానికి వెళ్లి సురేశ్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా అతడు పోలీసులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ వారి చొక్కాలు పట్టుకొని కొట్లాటకు దిగాడు. తమ కుటుంబం జోలికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని తెలుసుకొని పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న ఏఎస్‌ఐ క్రిష్ణ గ్రామానికి వెళ్లగా సురేశ్ ఏఎస్‌ఐని సైతం తిట్టాడని ఎస్‌ఐ పేర్కొన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించి దురుసు గా ప్రవర్తించినందుకు కానిస్టేబుళ్లు మోహన్, భిక్షపతిల ఫిర్యాదు మేరకు సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లింగం వివరించారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
పటాన్‌చెరు టౌన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీన్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సీతారామపురం గ్రామాని కి చెందిన నీలకంఠేశ్వర రావు(30) ఏడాది కిందట బతుకుదెరువు కోసం వచ్చి అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఉంటున్నాడు. ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 2న రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. సుల్తాన్‌పూర్ గ్రామ సమీపంలోని కల్యాణ్ వెంచర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం తరలించగా సోమవారం మృతి చెందాడు. మృతుడి పెద్దనాన్న కుమారుడు సోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దుర్గయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment