అదృశ్యమైన యువకుడు శవమై లభ్యం
మరో 20 రోజుల్లో మృతుడి వివాహం
న్యాల్‌కల్(జహీరాబాద్): అదృశ్యమైన యువకుడు శవమై కనిపించిన ఘటన మండల పరిధిలోని హుమ్నాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్‌ఐ చల్లా రాజశేఖర్ కథనం మేరకు.. నాగుల్‌గిద్ద మండలం గంగారం తండాకు చెందిన సునీల్ చౌహన్ హైదరాబాద్‌లో ఉంటూ కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం పిట్లంలోని ఆస్పత్రికి వస్తున్నానని, అనంతరం ఇంటికొస్తానని 1వ తేదీన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇంటికొస్తానన్న కుమారుడు రాకపోయే సరికి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆదివారం సునీల్ వాహనం పుల్‌కుర్తి బ్రిడ్జిపై పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం మంజీరా నదిలో శవమై కనిపించాడు. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment