ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోండి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డిలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్నా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపంచారు. వారం రోజుల వ్యవధిలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ ఇద్దరు మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న ప్రైవేటు హాస్పిటల్స్ కనీస సౌకర్యాలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో చాలా ఆస్పత్రిల్లో అర్హత లేని డాక్టర్లు, సిబ్బందితో పని చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకొని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి,కృష్ణ, నాయకులు రమేష్ మల్లేశం, అర్జున్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment