రామచంద్రాపురం(పటాన్‌చెరు): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది మే నెలలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో ఉంటున్న మీర్జా అక్బర్ బేగ్ అదే ప్రాంతంలో ఉండే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ రవీందర్, కోర్టు కానిస్టేళ్లు నర్సింహులు, శ్రీకాంత్, ఏఎస్‌ఐ రవీందర్ రెడ్డి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచారు. సోమవారం కేసును విచారించిన ఫస్ట్ అదనపు డిస్ట్రిక్ సెషన్స్ న్యాయమూర్తి కె.జయంతి నిందితుడు మీర్జా అక్బర్ బేగ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడేలా చేసినరవీందర్‌ను, పోలీస్ సిబ్బందిని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ డాక్టర్. జీ.వినీత్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment