నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో మంగళవారం న్యూల్యాండ్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జి.నారాయణ తెలిపారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన, డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మేళాలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదోతరగతి, ఇంటర్మీడియెట్ మెమోలు, ఆధార్ కార్డు, నాలుగు పాస్ పోర్టుసైజు ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు.
ప్రజావాణిలో 37 అర్జీలు
సంగారెడ్డి జోన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలొని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. ఈ మేరకు 37 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ జానకి రెడ్డి, సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్, డీపీఓ సాయిబాబా, కలెక్టరేట్ ఏవో పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment