మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
పైన పేర్కొన్న ఒక్క ఉదాహరణ చాలు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి. ఇలా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దుగ్యానాయక్ తండా లాంటి నివాసిత ప్రాంతాలు జిల్లాలో సుమారు 45 వరకు ఉన్నాయి. ఇవన్నీ టెయిల్ ఎండ్ (తాగునీటి పథకాలకు చివర) ఉన్న గ్రామాలు. నివాసిత ప్రాంతాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని, వేసవిలో ఈ సమస్య తలెత్తే అవకాశాలు మాత్రమే ఉన్నాయని మిషన్‌భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని చెబుతున్నారు.
తాగునీటికి సరఫరా వ్యవస్థ సరిగ్గాలేక..
మిషన్‌భగీరథ అధికారికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 633 గ్రామ పంచాయతీల పరిధిలో 915 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2.33 లక్షల ఇళ్లకు మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. సింగూరు జలాశయం నుంచే జిల్లా అంతటికి తాగునీటి సరఫరా అవుతోంది. ఈ జలాశయంలో సమృద్ధిగా నీరుంది. కానీ తాగునీటి సరఫరా వ్యవస్థ ఇంకా పటిష్టం కాకపోవడంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాగునీటి కోసం గ్రామాల్లోని బోర్ల నీటిని వాడకం తప్పనిసరిగా మారింది. ఆయా గ్రామ పంచాయతీల్లో బోరు మోటారు కాలిపోతే ఆ ప్రాంతమంతా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న మండలాలివి..
జిల్లాలో కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి, నాగల్‌గిద్ద, మానూరు, మొగుడంపల్లి, ఝరాసంఘం వంటి మారుమాల మండలాలతో పాటు, కొండాపూర్, కంది, అమీన్‌పూర్, ఆందోల్, హత్నూర, గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని టెయిల్ ఎండ్ గ్రామాల్లో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎండలు మరింత ముదిరితే ఈ గ్రామాల వాసుల నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం
వేసవిలో తాగునీటి సమస్యల తలెత్తే అవకాశాలున్న గ్రామాలను గుర్తించాం. ఒకవేళ అక్కడ తాగునీటికి ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతానికి జిల్లాలో తాగునీటి సమస్య లేదు. ఎక్కడైనా ఈ సమస్య ఎదురైతే టోల్‌ఫీ నెం.1800 5994007కు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసిన వెంటనే క్షేత్ర స్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తాం.
: పాష, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
న్యూస్‌రీల్
నీటి ఎద్దడి@ 45 ఆవాసాలు
స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన‘భగీరథ’ అధికారులు రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య మరింత పెరిగే అవకాశం సింగూరులో నీళ్లున్నా..సరఫరా వ్యవస్థలో లోపాలు తక్షణం స్పందించకుంటే సమస్యమరింత జటిలమయ్యే అవకాశం
గుక్కెడు తాగునీటి కోసం ఇలా గుట్టలు ఎక్కుతున్న ఈ గిరిజన మహిళలది సిర్గాపూర్ మండలం దుగ్యానాయక్‌తండా. సుమారు వంద వరకు కుటుంబాలు నివసించే ఈ తండాకు మిషన్‌భగీరథ పైప్‌లైన్ పనులు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఈ తండావాసులే స్వయంగా సమీపంలో ఉన్న బావిలోంచి మోటార్ల ద్వారా తరలించు కుంటున్నారు. ఈ మోటార్లు కాలిపోనప్పుడు ఇలా బిందెలతో సుమారు 200 మీటర్లు గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment