నీటి సమస్య తలెత్తకుండా చర్యలు
సంగారెడ్డి జోన్: గ్రామాలలో సాగు, తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగు, తాగు నీరు ఇబ్బందులు ఏర్పడే జిల్లాలలో మండలాల వారీగా తహసీల్దార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్, వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను రెగ్యులర్‌గా చెక్ చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసేందుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టరు మాధూరి, ట్రైనీ కలెక్టరు మనోజ్, ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ, ఇరిగేషన్, సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ క్రాంతి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
Comments
Please login to add a commentAdd a comment