ఖాళీ బిందెలతో నిరసన
మున్సిపల్ కార్యాలయం ఎదుట
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
సంగారెడ్డి: తమ కాలనీకి మంచినీళ్లు రావడంలేదని పట్టణంలోని మార్క్స్‌నగర్‌కు చెందిన మహిళలు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కాలనీలో తాగడానికి, నిత్యావసరాలకు నీరు రాకపోవడంతో ఇతరుల ఇళ్లకు వెళ్లి రోజు నీటిని అడుక్కొని తీసుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్‌కు మాజీ కౌన్సిలర్ గోవర్ధన్ నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment