సమాజసేవే లక్ష్యంగా పనిచేయాలి
సదాశివపేట(సంగారెడ్డి): విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలలో సమాజసేవే లక్ష్యంగా రోటరీ క్లబ్‌లు పనిచేయాలని రోటరీ క్లబ్‌ల డిస్ట్రిక్ గవర్నర్ శరత్‌చంద్రచౌదరి పేర్కొన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో రూ. 3లక్షలతో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ.50 లక్షలతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
అనంతరం సదాశివపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రభు, ప్రధాన కార్యదర్శిగా అశోక్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్‌కుమార్, మెంబర్‌షిప్ చైర్మన్‌గా చీలమల్లన్న ఎన్నికయ్యారు. ఫౌండేషన్ చైర్మన్‌గా డి.వినోద్‌కుమార్, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా డా.చంద్రశేఖర్, సభ్యులుగా రాజాకుమారి, పురం రజనీ, శరత్‌చంద్ర, అన్నపూర్ణ, రాజు,నరేందర్, నాగరాజు, డాక్టర్ మాలతీలత, రామకృష్ణ, కృపాకర్, రామకృష్ణారెడ్డి, రాచన్నలు ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు.
రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
డిస్ట్రిక్ గవర్నర్ శరత్‌చంద్రచౌదరి
Comments
Please login to add a commentAdd a comment