మృతురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు
తూప్రాన్: మా అమ్మ మృతికి తమ్ముడే కారణమని, ఓ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మండలంలోని గుండ్రెడ్డిపల్లికి చెందిన చింతల పోచమ్మ(74)కు కుమారుడు రాజు, కూతురు నాగరాణి ఉన్నారు. రాజు భార్యతో కాలంగా రంగారెడ్డి జిల్లా సురారంలో నివాసం ఉంటున్నాడు. కూతురికి సిద్దిపేట జిల్లా మామిడాల వ్యక్తితో వివాహం జరిపించారు. పోచమ్మ గ్రామంలో ఒంటరిగా నివసిస్తూ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతుంది. రాజు గతనెల 21న గ్రామానికి వచ్చి తల్లితో నిత్యం కుటుంబ విషయంలో గొడవపడుతున్నాడు. ఈనెల 4న ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పోచమ్మ మృతి చెందింది. తన తల్లి మృతికి తమ్ముడు రాజు కారణమని నాగరాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment