
చెరువులో దూకి ఆత్మహత్య
కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని శేరితండా పంచాయతీ వసురాంతండాలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరితండా పంచాయతీ వసురాం తండాకు చెందిన లంబాడీ శ్రీనివాస్(32)కి భార్య అనిత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ ఏ పని చేయకుండా మద్యానికి బానిసై రోజు భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రావడంతో రోజు మద్యం తాగితే ఆడపిల్లల పరిస్థితి ఏంటని భార్య ప్రశ్నించింది. దీంతో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తండా సమీపంలోని కన్నారం చెరువులో దూకాడు. గ్రామ స్తులు, కుటుంబీకులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment