
అందరికీ సమాన హక్కులు
న్యాయమూర్తి స్వాతిరెడ్డి
సిద్దిపేటకమాన్: రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ద్వారా అందరికీ సమాన హక్కులు ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆడపిల్లలు, మగపిల్లల మధ్య వ్యత్యాసం చూపకూడదన్నారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యానికి చెప్పాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా 15100కు ఫోన్ చేయాలని తెలిపారు. సిద్దిపేట కోర్టు భవనంలో కోర్టు మహిళా సిబ్బంది, మహిళ న్యాయవాదులకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మిలింద్‌కాంబ్లీ, తరణి, తదితరులు పాల్గొన్నారు.
పంటలకు నీరందించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపి ఈ ప్రాంతంలో ఉన్న యాసంగి పంటలకు నీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలకు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం కార్యకర్తలతో కలసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీసీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, బక్కెల్లి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.
గడ్డి మోపులు దగ్ధం
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం గడ్డిమోపులను లోడ్ చేసుకొని వెళ్తున్న డీసీఎం వ్యాన్‌కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన వ్యాన్ డ్రైవర్ సమీపంలోని నీటి కాల్వలోకి వ్యాన్ తీసుకెళ్లి మోపులను కూలీల సహాయంతో తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే గడ్డి మోపులు దగ్ధమయ్యాయి.
దొంగతనం కేసులో జైలు శిక్ష
మిరుదొడ్డి(దుబ్బాక): లోక్ అదాలత్‌లో దొంగకు జైలు శిక్ష పడినట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ బోయిని పరశురాములు తెలిపారు. బుధవా రం ఆయన కథనం మేరకు.. మిరుదొడ్డి పీఎస్ పరిధిలోని అక్బర్‌పేట–భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన కొంపల్లి భాను ప్రకాశ్‌పై 2024 ఏప్రిల్ 23న దొంగతనం కేసు నమోదైంది. ఈ కేసుపై లోక్ అదాలత్‌లో భాగంగా దుబ్బాక మెజిస్ట్రీట్ కోర్టులో విచారణ జరిగిందని తెలిపారు. కేసు విచారణ అనంతరం భాను ప్రకాశ్‌కు 35 రోజుల జైలు శిక్షతోపాటు, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

అందరికీ సమాన హక్కులు

అందరికీ సమాన హక్కులు
Comments
Please login to add a commentAdd a comment