
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
● రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందుతున్న జక్కాపూర్ పాఠశాల ● వార్షికోత్సవ వేడుకల్లో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
సిద్దిపేటరూరల్: జక్కాపూర్ ఉన్నత పాఠశాల రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, దానికోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు షౌకత్‌అలీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బృందం సమిష్టిగా పనిచేస్తూ పదవ తరగతిలో ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 13 మంది విద్యార్థులు ఉపకార వేతనానికి అర్హత సాధించారని, అదే విధంగా గణిత, సైన్స్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్టుల్లో కూడా పాఠశాల విద్యార్థులు ప్రతిభ సాధిస్తున్నారన్నారు. అనంతరం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రామస్వామి, ఎంఈఓ గౌరిమోహన్, కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ శోభారాణి పాల్గొన్నారు.
సైన్స్ అంటేనే వాస్తవికతకు నిదర్శనం
దుబ్బాకటౌన్: సైన్స్ అంటేనే వాస్తవికతకు నిదర్శనమని, ఎల్లప్పుడూ మన జీవితంలో శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచించి మూఢ నమ్మకాలను విడనాడి వాస్తవాలను మాత్రమే ఆచరించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించి అవి పని చేసే తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాదత్ అలీ, ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment