
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చౌడారంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కడారి లింగం(50)కు భార్య పద్మ, కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. లింగం భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం పని లేకపోవండతో ఎల్లమ్మజాలు శివారులోని చెరువుకు చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం చెరువు గట్టు వద్ద చెప్పులు, గాలం వైరు ఉన్నాయి. గాలం వైరు లాగడంతో లింగం మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరకొని పరిశీలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి
చేగుంట(తూప్రాన్): రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బుధవారం మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కామారెడ్డి రైల్వే హెడ్ కానిస్టేబుల్ రవి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామారెడ్డి రైల్వే ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సంబంధీ కులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీస్‌లను సంప్రదించాలని తెలిపారు.
బావిలో పడి రైతు
మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భూషణమైన సాయిలు(71) వ్యవసాయ బావిలోని మోటార్ పంపు పాడైపోవడంతో బావిలోకి దిగి మోటార్ పంపును సరి చేశాడు. అనంతరం పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయి మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment