● మద్యం మత్తులో దాష్ఠీకానికి ఒడిగట్టిన యువకుడు ● అందోల్ మండలంలో వెలుగులోకి..
వట్‌పల్లి(అందోల్): మతి స్థిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోల మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో నాలుగు రోజుల ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన యువతి(24)కి చిన్ననాటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజూ గ్రామంలో ఉదయం నుంచి రాత్రి వరకు అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన మన్నె శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో ఆ యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై యువతి తల్లి నాగమణి మంగళవారం జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయగా, సీఐ అనిల్‌కుమార్ బుధవారం నేరడిగుంట గ్రామానికి చేరుకొని ఘటనపై విచారణ జరిపారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment