
అడ్డంగా దొరికి
అక్రమంగా తరలిస్తూ..
● 1.02 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
● ఇద్దరు అరెస్టు..రిమాండ్‌కు తరలింపు
● సెప్టిక్ ట్యాంకర్‌లో తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
● ఫైనాన్షియర్‌ను పట్టుకున్న స్పెషల్ ఆపరేషన్ బృందం
● ఏఓబీ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న వైనం
● మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియాకు వెల్లడి
పటాన్‌చెరు: ఎవరికీ అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంకర్‌లో భారీ ఎత్తున రవాణా చేస్తున్న గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ గంజాయి అక్రమ రవాణాకు కీలకంగా వ్యవహరించిన ఫైనాన్షియర్‌ను స్పెషల్ ఆపరేషన్ టీమ్ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్) హరికిషన్ పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బుధవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ప్రాంతంలోని ఓఆర్‌ఆర్ ఎగ్జిట్–2 వద్ద జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులోభాగంగా సెప్టిక్ ట్యాంకర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా అందులో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను చెత్త, ప్లాస్టిక్ కవర్ల కింద కప్పి ఉంచి రవాణా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి అందులోంచి సుమారు 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
మహారాష్ట్రకు చేరవేసేందుకు...
ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు చిత్రకొండ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన దీపక్ నాగ్‌నాథ్ గోయ్, నారాయణఖేడ్ ప్రాంతవాసి భీమ్‌సింగ్ మాధవ్‌కు సెప్టిక్ ట్యాంక్ ద్వారా చేరవేసేందుకు ప్రణాళిక వేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతోపాటుగా ఈ అక్రమ రవాణాకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని ప్రత్యేక ఆపరేషన్ టీమ్ రంగంలోకి దిగి కామారెడ్డి జిల్లా పిట్లం సమీపంలో పట్టుకుంది. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు 1.02కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగాా వ్యవహరించిన డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్‌తోపాటు ఎస్సైలు సతీశ్, శ్రీనివాసరెడ్డి,హన్మంత్, కానిస్టేబుల్‌లను ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌్‌రెడ్డి, మెదక్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎకై ్సజ్ సూపరిండెంట్ ఎస్.నవీన్‌చంద్ర అభినందించారు.

అడ్డంగా దొరికి
Comments
Please login to add a commentAdd a comment