
సీఎంకు సమస్యను వివరిస్తాం
ప్రజా సంఘాల పోరాట వేదిక
కన్వీనర్ రాజయ్య
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు 29వ రోజుకు చేరాయి. బుధవారం నిరసనలో భాగంగా ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ రాజయ్య నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు రద్దు చేయాలని సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో చేస్తున్నామని రాంకీ సంస్థ అబద్ధాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరిస్తామన్నారు. అప్పటికీ సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని తెలిపారు. డంపింగ్‌యార్డ్ ఏర్పాట్లు విరమించే వరకు ప్రజల పక్షాన సీపీఎం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
వర్క్‌లోడ్ ఇప్పించాలి
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు
బీఎంఎస్ నేతల విజ్ఞప్తి
కంది(సంగారెడ్డి): కంది మండలంలోని ఎద్దు మైలారం ఆయుధ కర్మాగారం(ఓడియఫ్)కు వర్క్ లోడ్ ఇప్పించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బీఎంఎస్, ఓఎఫ్‌ఎంఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరయ్య,ప్రభు,నాయకులు బల నర్సయ్య, వెంకట్ రెడ్డి తదితరులున్నారు.
చెడ్డీగ్యాంగ్ దొంగల
సంచారం
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో దొంగతనం చేసేందుకు చెడ్డీగ్యాంగ్ దొంగలు సంచరించడం పట్టణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. సోమవారం రాత్రి రెండుగంటల సమయంలో సాయినగర్ కాలనీలో చెడ్డీగ్యాంగ్ మారణాయుధాలతో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. సాయినగర్ కాలనీలో మెడికల్ అసోసియేషన్ భవనానికి తాళం వేసి ఉండటంతో భవనం వద్దకు నలుగురు చెడ్డీ గ్యాంగ్ దొంగలు చేరుకున్నారు. ఇద్దరు చెడ్డీలపై ఉండి, ముఖాలకు ముసుగువేసుకున్నారు. దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కుక్కలు మొరగడంతో ఎదురింట్లో నివాసం ఉండే వ్యక్తి పైకి ఎక్కి పరిశీలించాడు. దొంగలు వచ్చిన విషయాన్ని గమనించి గట్టిగా కేకవేసి దొంగలకు కనిపించకుండా దాక్కున్నాడు. దీంతో దొంగలు తమరిని ఎవరో చూశారనే కంగారుతో భవనం తాళం పగులగొట్టకుండానే వెనుదిరిది వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్.ఐ కాశీనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసు పెట్రోలింగ్ సక్రమంగా లేకపోవడం వల్లే దొంగలు సంచరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనాల
కోసం ఉద్యమం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
చుక్కారాములు
జహీరాబాద్ టౌన్: కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర ట్రాక్టర్ ప్లాంట్‌లో బుధవారం కార్మికులు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 15 ఏళ్ల నుంచి కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించి నిరసన కార్యక్రమాలు చేపట్టినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంకు సమస్యను వివరిస్తాం

సీఎంకు సమస్యను వివరిస్తాం
Comments
Please login to add a commentAdd a comment