
ప్రవేశాలకు ప్రత్యేక ప్రణాళిక
కలెక్టర్ వల్లూరు క్రాంతి
కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిను కలిసిన అస్మ తబస్సుం
సంగారెడ్డి జోన్: మోడల్ స్కూల్‌లో విద్యార్థుల ప్రవేశాలను గరిష్టస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉన్నతాధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆమె విద్యా శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులు, భవిష్యత్ ప్రణాళికలు, మోడల్ స్కూల్స్ అభివృద్ధి, నిర్మాణ పనులు, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మోడల్ స్కూల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై ఆన్‌లైన్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పోటీలకు హాజరైన కలెక్టర్
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన క్రీడా పోటీలకు కలెక్టర్ క్రాంతి హాజరై ఆటలు ప్రారంభించారు. మహిళలతో కలసి పోటీలో పాల్గొని చెస్, క్యారమ్స్ ఆడారు. కార్యక్రమంలో డీఆర్‌వో పద్మజారాణి, సెంట్రల్ యూనియన్ కార్యదర్శిలు నిర్మల, టీఎన్జీవో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ, కార్యదర్శి రవి, అసో సియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌస్,సెంట్రల్ యూనియన్ ఆఫీస్, జిల్లా టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు, జిల్లా అధికారులు ,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మ తబస్సుం బుధవారం పార్టీ ఇన్‌చార్జి, మాజీమంత్రి చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ నియోజకవర్గం అధ్యక్షురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రశేఖర్ సూచించారు.

ప్రవేశాలకు ప్రత్యేక ప్రణాళిక
Comments
Please login to add a commentAdd a comment