మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
సంగారెడ్డి డిప్యూటీ లేబర్ కమిషనర్ నీరజ
సదాశివపేట(సంగారెడ్డి): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి డిప్యూటీ లేబర్ కమిషనర్ నీరజ ఆకాంక్షించారు. పట్టణంలోని భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లోనూ వివక్షనెదుర్కొన్న మహిళలు ఐక్యంగా ఉద్యమించడం వల్లే నేడు అంతర్జాతీయంగా పురుషులతో పోటీ పడి పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద,శ్రామిక మహిళ కార్యదర్శి అనసూజ, బీకేఎంయూ మహిళా విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సెకండియర్
పరీక్షలు ప్రారంభం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలిరోజు ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులు వెల్లడించారు. తొలిరోజు ద్వితీయ భాష తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 15,989 మంది విద్యార్థులకు గానూ 15,687 మంది విద్యార్థులు హాజరు కాగా 302 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 14,418 మంది విద్యార్థులకు గానూ 14,196 మంది విద్యార్థులు హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 1,571 మంది విద్యార్థులకు గానూ 1,491 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి 03, డీఈసీ సభ్యులు 05,హెచ్‌పీసీ సభ్యులు 05,ఫ్లయింగ్‌స్క్వాడ్ 13, సిట్టింగ్ స్క్వాడ్ 08 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ప్యారానగర్‌లో సర్వేయర్లబృందం పర్యటన
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ గ్రామంలో డంప్‌యార్డ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం అక్కడ పర్యటించింది. అటవీ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్‌లో డంప్‌యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి.
రాచన్నస్వామినిదర్శించుకున్న సెట్విన్ చైర్మన్
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి కోహీర్ మండలంలోని బడంపేట రాచన్నస్వామిని గురువారం దర్శించుకున్నారు. రాచన్నస్వామి జాతర మహోత్సవాలకు హాజరైన ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
కనీస వేతనం
రూ.26 వేలు ఇవ్వాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
చుక్కా రాములు
పటాన్‌చెరుటౌన్: కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పటాన్‌చెరు డివిజన్ సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జీవోలను విడుదల చేసిందని, ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను సవరించాలన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
Comments
Please login to add a commentAdd a comment