డ్రైవింగ్‌తో మహిళలకు ఉపాధి
సంగారెడ్డి జోన్: మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందడంతోపాటు వారికి ఉపాధి కూడా లభిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మెట్రో నగరానికి హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల మహిళా డ్రైవర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మహిళలు డ్రైవింగ్ నైపుణ్యం సాధించడం వల్ల ప్రతీ నెల రూ.15 నుంచి రూ.20వేల వరకు ఆదాయం పొందే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. మహిళలు క్యాబ్ డ్రైవర్లుగా ఉంటే అందులో ప్రయాణించే మహిళలకు భద్రత ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యం సాధించిన వారికి వివిధ క్యాబ్ సర్వీసెస్ సంస్థలతో, ఇతర ప్రైవేట్ సంస్థలు, పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి వారికి అందులో ఉపాధి లభించేలా చూస్తామని చెప్పారు. ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అదనపు డీఆర్‌డీవోలు, డీపీఎంలు,ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment