పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లు మృత్యువాత
శివ్వంపేట(నర్సాపూర్): కోళ్లు మృత్యువాత పడిన ఘటన మండల పరిధి గూడూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లపల్లి తండాకు చెందిన లోకేశ్ గూడూర్‌లో పౌల్ట్రీ ఫామ్‌ని లీజుకు తీసుకొని ప్రీమియం కంపెనీ ద్వారా కోళ్లను పెంచుతున్నాడు. మూడు రోజుల నుంచి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకు 4 వేల కోళ్లు మృతి చెందినట్లు లోకేశ్ తెలిపాడు. మృతి చెందిన కోళ్లను జేసీబీ గుంతలో పూడ్చి వేయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పశు వైద్యాధికారి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లగా కోళ్లు మృత్యువాత పడిన సమాచారం లేదని ఫామ్‌లలో కోళ్లు మృతి చెందితే గుంత తీసి పూడ్చివేయాలని మండల వ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫామ్ యజమానులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment