వ్యక్తి అదృశ్యం
జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కాశీనాథ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుపుల రాజు(40)కి భార్య కూతురు ఉన్నారు. వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2న పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నాడు. అతడి భార్య పద్మ చర్చికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భర్త రాజు కనిపించలేదు. బంధువులు, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
దొంగతనం కేసులో జైలు
వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో దొంగతనానికి పాల్పడిన నిందితుడికి గురువారం గజ్వేల్ కోర్టు న్యాయమూర్తి ప్రియాంక ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారని గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. చాంద్‌ఖాన్‌మక్తకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ చెఫ్ పొయినమైన సుధాకర్(30) అక్టోబర్ నెలలో అనంతగిరిపల్లిలో దొంగతనానికి పాల్పడగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారించిన గజ్వేల్ కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారని ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment