పోలీసుల అదుపులో నిందితులు
జోగిపేట(అందోల్): పట్టపగలే ఓ వ్యక్తిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెదిరించి నగదు దోచుకెళ్లారు. ఎస్‌ఐ పాండు కథనం మేరకు.. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనుకిషోర్ బుధవారం జోగిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దిగి పట్టణంలోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నాడు. మార్కెట్ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెదిరించి అనుకిషోర్ వద్ద ఉన్న రూ.13 వేలు దొంగిలిచుకుపోయారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కెట్‌లో అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా మరొకరి వ్యక్తితో కలిసి డబ్బులు దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. కర్ణాటకలోని భీమా నగర్ బాల్కీకి చెంది న శివకుమార్, జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఐ లాష్ పూర్ ఆకాశ్‌పై కేసు నమోదు చేసి గురువారం కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment