జిన్నారం (పటాన్‌చెరు): చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు.. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన పంచలింగాల ఆనంద్ రెడ్డికి 6న ఉదయం గ్రామస్తుడు పెబ్బేడి సాయిరామ్ ఫోన్ చేసి ఎర్రచెరువు వద్దకు రావాలని అన్నారు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. రెండు రోజుల కిందటే చనిపోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు భావించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment