సిద్దిపేటకమాన్: పురోహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట పట్టణంలోని గాడిచర్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ ఎస్‌ఐ కనకయ్య కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాకు చెందిన కృష్ణ అనూజ్ త్రిపాఠి(24) గతేడాది బతుకు దెరువు నిమిత్తం సిద్దిపేటకు వచ్చి పట్టణంలోని ఓ పురోహితుడి వద్ద పౌరోహిత్యం చేసుకుంటూ గాడిచర్లపల్లిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కృష్ణ సోదరుడు రామ్‌దినశర్మ గురువారం ఇంటికి వచ్చి చూసేసరికి లోపల ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఆందోళనకు గురైన అతడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment