52 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చిన్నకోడూరు(సిద్దిపేట): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నకోడూరు ఎస్‌ఐ బాలకృష్ణ కథనం మేరకు.. నమ్మదగ్గ సమాచారం మేరకు గురువారం మండల పరిధిలోని మల్లారం చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా సిద్దిపేట పట్టణానికి చెందిన వానరాశి రాజు ఆటోలో ఎలాంటి అనుమతులు లేకుండా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలించాం. నిందితుడు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, మండల పరిధిలోని సికింద్లాపూర్‌లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ముక్కెర కనకయ్య, సంపత్‌ల ఇంట్లో బియ్యాన్ని నిల్వ చేయడంతో ఇరువురిపై కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని
మహిళ మృతి
పటాన్‌చెరు టౌన్: గు ర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఆసిఫ్ అలీ కథనం మేరకు.. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ షాపు డబ్బా వెనుకాల గుర్తు తెలియని పడిపోయి ఉంది. మహిళకు చీమలు పట్టి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి వయస్సు 50 ఏళ్ల వరకు ఉంటుందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్ప త్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. గురువారం కౌడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథ నం మేరకు.. మండల ంలోని కంచన్‌పల్లి గ్రామానికి చెందిన బోయిని కుమార్(38) కొత్తగా ఇల్లు కట్టాడు. ఇంటి నిర్మాణం కోసం కొంత భూమి అమ్మగా మిగితా డబ్బులు అప్పులు చేశాడు. అప్పులు తీర్చమా ర్గం లేకపోడంతో 3న ఇంటి డాబా పైకి ఎక్కి పురుగుల మందుతాగాడు. గమనించిన భార్య జ్యోతి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురు వారం మృతి చెందినట్లు తెలిపారు. జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళా వాకర్స్‌ను
ఢీకొట్టిన బైక్
ముగ్గురికి గాయాలు
రామాయంపేట(మెదక్): వాకింగ్‌కు వెళ్తున్న మహిళలను వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం రామాయంపేట పట్ణణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సౌమ్య, లావణ్య, శ్రీలత, మరో ముగ్గురు మహిళలు సాయంత్రం వేళ కామారెడ్డి రోడ్డు వైపు వాకింగ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మద్యం సేవించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాల్‌రాజ్ పేర్కొన్నారు.
కుంటలో పడి శవమై తేలి
గజ్వేల్‌రూరల్: ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. సంగుపల్లికి చెందిన బడె యాదగిరి(43), నిర్మల దంపతులకు నలుగురు ఆడ పిల్లలున్నారు. యాదగిరి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 3న ఇంట్లో కుటుంబ సభ్యులకు బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం నిర్మల తమ బంధువులతో కలిసి గ్రామ శివారులోని పాతకుంట వద్ద వెతుకుతుండగా యాదగిరి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
52 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
52 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
52 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment