ప్రతిభ పరీక్షలో రాణించిన విద్యార్థులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల ప్రతిభను వెలికితీసే భాగంలో కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ విద్యార్థులు రాణించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిభ పరీక్షలో పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. వీరికి కాగ్రిజెంట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సంస్థ ఉచితంగా ల్యాప్‌టాప్ అందజేయడంతోపాటు, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో తరగతులు అందించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment