నైపుణ్యం ప్రదర్శించేందుకు ఈ బాహ వేదిక
నర్సాపూర్: విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ బాహ సే ఇండియా వేదిక లాంటిదని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్ సుబ్రమణ్యం సూచించారు. ఇటీవల నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీలో ఈ బాహ సే ఇండియా పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నిర్వహణలో భాగస్వామ్య కంపెనీలు గురువారం బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీలో క్యాంపస్ సెలెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. యువ ఇంజనీరింగు విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అడ్డంకులు, సవాళ్లను అధిగమించి నిజ జీవిత అనుభవాన్ని పొందడానికి ఈ బాహ పోటీలు దోహదపడుతాయని వివరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె మాట్లాడుతూ.. క్యాంపస్ సెలక్షన్‌లో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు పలు రకాల పరీక్షలు నిర్వహించారని తెలిపారు. సెలెక్షన్స్‌లో కాలేజీకి చెందిన సుమారు 600 మంది విద్యార్థులు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల ప్యాకెజీతో ఉద్యోగాలు పొందారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment