విద్యుదాఘాతంతో అన్నాదమ్ముళ్లు మృతి
జహీరాబాద్ మండలంలోని గోవింద్‌పూర్ గ్రామంలో ఘటన
జహీరాబాద్ టౌన్: తండ్రి చనిపోవడంతో కొత్తగా వ్యవసాయం పనులు ప్రారంభించిన ఇద్దరు అన్నాదమ్ముళ్లను కరెంట్ కాటేసింది. పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు కరెంట్ సరఫరా కావడంతో అన్నాదమ్ముళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని గోవింద్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిరాగ్‌పల్లి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన ఎరుకల నాగన్నకు జగన్(48), మల్లేశం(42) ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి పొలం పనులు చేస్తుండగా అన్నాదమ్ముళ్లు ఇద్దరు వంటలు చేసేవారు. ఏడాది కిందట నాగన్న పాముకాటుతో మృతి చెందడంతో అన్నాదమ్ముళ్లు ఇద్దరూ వ్యవసాయం పనులు ప్రారంభించారు. ఇటీవల మూడు ఎకరాల్లో చెరకు తోట వేశారు. అడవి పందులు పంటను ధ్వంసం చేస్తున్నాయని, రక్షణగా పొలం చుట్టూ ఫెన్సింగ్ తీగలు చుట్టారు. ఫెన్సింగ్ తీగకు కనెక్షన్ ఇవ్వడానికని 11 కేవీ లైన్‌కు తీగలు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో అన్నాదమ్ముళ్లు మృతి
Comments
Please login to add a commentAdd a comment