మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు
● వన్ టౌన్ సీఐ వాసుదేవరావు
● సిద్దిపేటలో నార్కోటిక్ డాగ్స్‌తో తనిఖీలు
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని పలు దుకాణాలు, పాన్‌షాపులు, బస్టాండ్ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నార్కోటిక్ డాగ్స్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణ గురించి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలు, యువత గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మత్తు పదార్థాలు కలి గిన చాక్లెట్ విక్రయించినా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, వన్ టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment