ఆకాశవాణి.. మహిళా కేంద్రం | - | Sakshi
Sakshi News home page

ఆకాశవాణి.. మహిళా కేంద్రం

Published Sat, Mar 8 2025 7:54 AM | Last Updated on Sat, Mar 8 2025 7:54 AM

ఆకాశవ

ఆకాశవాణి.. మహిళా కేంద్రం

డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్‌లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్‌ నర్సమ్మ, జనరల్‌ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్‌:

గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ

ఝరాసంగం మండలంలోని మాచ్‌నూర్‌ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్‌ గ్రామానికి చెందిన అల్గోల్‌ నర్సమ్మ, పస్తాపూర్‌ గ్రామానికి చెందిన జనరల్‌ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్‌ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్‌ చేసుకుంటారు. డీడీఎస్‌కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్‌ చేసుకొని స్టేషన్‌ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్‌ చేసుకొని ప్రసారం చేస్తారు.

ముఖ్యమైన ప్రసారాలు

మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్‌ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.

వారే మిక్సింగ్‌, కంపోజింగ్‌..

అల్గోల్‌ నర్సమ్మ, జనరల్‌ నర్సమ్మ రేడియో స్టేషన్‌లో మిక్సింగ్‌, కంపోజింగ్‌, ట్రాన్స్‌మిషన్‌ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్‌ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్‌ డైరెక్టర్‌ దివంగత పీవీ సతీష్‌ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మహిళల సంఘం రేడియో స్టేషన్‌

ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు

స్థానిక అంశాలే ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
ఆకాశవాణి.. మహిళా కేంద్రం1
1/2

ఆకాశవాణి.. మహిళా కేంద్రం

ఆకాశవాణి.. మహిళా కేంద్రం2
2/2

ఆకాశవాణి.. మహిళా కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement