జాతీయ సమైక్యత శిబిరంలో మెరిసిన తెలంగాణ
తొలిస్థానంలో నిలిచిన
రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల బృందం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర మానవ వనరుల,యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒడిశాలోని బరంపూర్‌లో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో సాంస్కృతిక విభాగంలో తెలంగాణ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ బృందం ప్రతిభ కనబరచి మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి జగదీశ్వర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి బరంపూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో రాష్ట్రం నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల బృందం చిత్రకళ, రంగోలీ, శాసీ్త్రయనృత్యాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ బోనాలు ప్రదర్శించారు. ఈ శిబిరంలో 15 రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 210 మంది వలంటీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment