నిందితులను కఠినంగా శిక్షించాలి
జహీరాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిలాల్లో ఆశవర్కర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం జహీరాబాద్‌లో నిరసన తెలిపి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ...మహిళా కార్మికులకు రక్షణలేకుండా పోతుందన్నారు. విధులు ముగించుకుని వెళ్తున్న ఆశవర్కర్‌ను హత్య చేసినా...అక్కడి పోలీసులు దుండగులను పట్టుకునేందుకు కాలయాపన చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు యశోదమ్మ,శ్యామల, పూజ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment