
ఆడ పిల్లలకు అండగా.. ఆర్థిక భరోసా
బెజ్జంకి(సిద్దిపేట): ఆడపిల్లలకు అండగా ఉంటూ ఆర్థిక చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బెజ్జంకి మండల కేంద్రంలో లింగాల లక్ష్మణ్ యువసేన సభ్యులు. జూలై 13, 2022లో లింగాల లక్ష్మణ్ యువసేన అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. గ్రామంలో పుట్టిన పేదింటి ఆడ పిల్లలకు రూ.5,016 చొప్పున ఇప్పటి వరకు 25 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మెగా కార్యక్రమాన్ని నిర్వహించి 11 మంది చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. ఇదే కాకుండా ప్రభుత్వాస్పత్రి మహిళా సిబ్బంది, ఆశ కార్యకర్తలకు చీరలను పంపిణీ చేశామన్నారు.
● 25 కుటుంబాలకు రూ.5,016 చొప్పునసాయం
● లింగాల లక్ష్మణ్ యువసేన సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment