
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.. వీటన్నింటికి మించి ఓ పోరాట యోధురాలు. శక్తి యుక్తులు కలిగిన పోరాట నారీమణి. ఇప్పుడు ఆమె ఆకాశంలో సగం కాదు.. అన్నింటా ఆమె. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్నింట్లోనూ ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. నేటి ఆమె అడుగు మోపని రంగం లేదు.. చేయని పని లేదు.. సాధికారితే లక్ష్యంగా సాగుతూ.. చదువులోనూ, సేవా కార్యక్రమాల్లోనూ, ఉపాధి రంగంలోనూ, రాజకీయాల్లోనూ పెను మార్పులు తెస్తోంది. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు రంగాల్లోనూ, చదువుల్లోనూ రాణిస్తున్న మహిళలు, విద్యార్థినులపై సాక్షి ప్రత్యేకం కథనం..
Comments
Please login to add a commentAdd a comment