ఆ ఇంటా నలుగురు అమ్మాయిలూ డాక్టర్లే
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఈ రోజుల్లో ఒక అమ్మాయిని పెంచడమే భారంగా భావిస్తున్న తరుణంలో నలుగురు అమ్మాయిలను పెంచి ఎంబీబీఎస్ చదివించడం అంటే ఆశ్చర్యం కలుగక మానదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ కాలనీకి చెందిన కొంక రామచంద్రం, శారద దంపతులు దర్జీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మమత, మాధురి, రోహిణి, రోషిణి నలుగురు సంతానం. ఈ దంపతులు అధైర్యపడకుండా పిల్లలని కష్టపడి చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం నలుగురూ ఎంబీబీఎస్ చదువుతున్నారు. తమ పిల్లలు పెద్ద అయ్యి, ఎంబీబీఎస్ సీట్లు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ దంపతులు.
గ్రామీణ ‘నారీ’మణులు
‘అహిల్య నారీశక్తి అవార్డు’కు
యువతులు ఎంపిక
చిన్నశంకరంపేట(మెదక్): విద్య, వైద్యం పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామీణ ప్రాంతంలో సేవలు అందిస్తున్న చిన్నశంకరంపేట మండలంలోని ఇద్దరు యువతులు అహిల్య నారీ శక్తి అవార్డుకు ఎంపికయ్యారు. ఖాజాపూర్ తండా కు చెందిన ధనావత్ స్వరూప, చందాపూర్ గ్రామానికి చెందిన తలారి స్వాతి అహిల్య నారీ శక్తిగా గుర్తించి అవార్డును అందిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన అహిల్య ఉమెన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పూనమ్ నోముల్వార్ తెలిపారు. మహిళ దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ..తాను తల్లితండ్రులు లేని లోటును బాల్యం నుంచే అనుభవిస్తున్నాను. అందుకే గ్రామీణ చిన్నారులకు, నిరుపేదలకు విద్య, వైద్యం కోసం తనకు తోచిన తీరులో సేవ చేస్తు న్నా. చందాపూర్ గ్రామానికి చెందిన స్వాతి మా ట్లాడుతూ.. ఎంబీఏ చదువుతూనే సెలవు రోజు ల్లో గ్రామీణ విద్యార్థులకు సాయం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సానీ క్ష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందునకుగాను వీరు అవార్డుకు ఎంపికై నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment