
పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు
రకరకాల పక్షులు పెంచుతున్న మల్లాగౌడ్
రూ.వేలల్లో ఖర్చు చేసి ఇష్టంతో కొనుగోలు
కౌడిపల్లి(నర్సాపూర్): అతడి వృతి వ్యవసాయం, ఉద్యోగం లైన్‌మెన్.. అయినా సరే ఖాళీ సమయం దొరికితే చాలు పక్షులతో కాలక్షేపం చేస్తాడు. పక్షులంటే అతడికి అమితమైన ప్రేమ. ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా కొనేస్తుంటాడు. వాటి దాణా కోసం రూ.వేలల్లో ఖర్చు చేస్తాడు.
కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లాగౌడ్‌కు ఇంటి వద్ద చిన్న చిన్న జాలీలతో షెడ్స్ వేసి పక్షులను పెంచుతున్నాడు. ప్రస్తుతం అతడి దగ్గర కాక్‌టెల్ చిలుకలు 4, లవ్‌బర్డ్స్ 10, ఆఫ్రికన్ లవ్‌బర్డ్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ 8, కాసులు 4, పావురాలు 10 జతలు, లక్కిపావురాలు 4 జతలు,, పందెం కోళ్ల పెట్టలు పుంజులతోపాటు కొమోరియన్ జాతి కుక్క, అక్వేరియం ఉన్నాయి. వివిధ రకాల పక్షులకు ఒక్కో జత రూ.1,000 నుంచి రూ.5 వేల వరకు ధర చెల్లించి కొనుగోలు చేశాడు. ఇలా కొన్నేళ్లుగా పక్షులను పెంచుతున్నాడు. పక్షులంటే ప్రాణం అని అందుకే రూ.లక్షలు ఖర్చుచేసి వాటిని కొనుగోలు చేస్తున్నాడు.
హైదరాబాద్ నుంచి దాణా
పక్షుల కొనుగోలుకు రూ.లక్షలు ఖర్చు చేయగా వాటి పెంపకం, పోషణకు ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేస్తుంటాడు. హైదరాబాద్ మక్క మజీద్ పక్కన మినార్ బర్డ్స్ మార్కెట్ నుంచి పక్షులను కొనుగోలు చేసి అక్కడి నుంచే వాటికి దాన సైతం ప్రతి నెలా తెస్తాడు. వీలు కాని సమయంలో సంగారెడ్డి జిల్లా జోగిపేట నుంచి దాణా తీసుకొస్తాడు. పక్షుల దాణాకు గాను కొర్రలు, సజ్జలు, రాగులు, సన్‌ప్లవర్, స్వీట్ కార్న్, కుసుమలు కొనుగోలు చేసి వాటికి పెడతాడు.
ప్రత్యేక షెడ్స్ ఏర్పాటు
పక్షులు పెంచేందుకు గాను ప్రత్యేకంగా ఇంటి ఆవరణలో కొద్ది స్థలంలోనే వాటికి జాలీలతో షెడ్స్ ఏర్పాటు చేశాడు. వాటిలో పక్షులకు సౌకర్యంగా ఉండేందుకు కుండలు, చెక్కలతో తయారు చేసిన పెట్టెలు ఏర్పాటు చేశాడు. అందులోనే దాణా వేస్తాడు. ప్రతిరోజూ దాణా వేస్తూ నీళ్లు పోస్తాడు. నాలుగు అయిదు రోజులకు ఒకసారి వ్యర్థాలను శుభ్రం చేస్తాడు. పొరపాటున షెడ్ జాలీ డోర్ ఊడిపోతే పక్షులు ఎగిరిపోయి తిరిగి రావని అలా వెల్లినవి బయట ఎక్కువ రోజులు బతకలేవని మల్లా గౌడ్ చెప్పాడు. వేసవి కాలంలో ఎక్కువగా పక్షులు చనిపోతుంటాయి. వాటి రక్షణకు ఎంత చల్లధనం ఏర్పాటు చేసిన కొన్నిసార్లు చనిపోతాయి. దీంతో తిరిగి కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఇక పందెం కోళ్లు, కాసులు, పావురాలు బయటకు వదిలితే చెట్ల నీడన ఇంటి ఆవరణ, చుట్టుపక్కల తిరిగి వస్తాయి. కొమోరియన్ కుక్కతోపాటు అక్వేరియం ఉంది.
ఇష్టంతో పెంచుతాం
పక్షులంటే తనకు ప్రాణం. వ్యవసాయంతోపాటు లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తా. సుమారు ఇరవై ఏళ్లుగా వాటిని పెంచుతున్నా. హైదరాబాద్ మినార్ బర్డ్స్ మార్కెట్ నుంచి పక్షులను కొనుగోలు చేస్తా. ఒక్కో రకం పక్షి జతకు రూ .1,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. ఉదయం, సాయంత్రం వాటితో గడుపుతా. మిగితా సమయంలో కుటుంబ సభ్యులు చూస్తారు. పక్షులంటే ఇష్టం కాబట్టి ఖర్చుకు వెనుకాడను.
– మల్లాగౌడ్, కంచన్‌పల్లి

పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు

పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు

పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు

పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు

పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు

పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు
Comments
Please login to add a commentAdd a comment