
బేగంపేట విద్యార్థిని ప్రపంచ రికార్డ్
8 సెకండ్ల 85 మిల్లీ సెకన్స్‌లో
ఆవర్తన పట్టిక కంఠస్థం
దుబ్బాకటౌన్: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి అన్నారు. శనివారం చైన్నెలో జరిగిన ప్రపంచ పోటీల్లో పాఠశాలకు చెందిన పంజాల కార్తీక పాల్గొని ప్రపంచ రికార్డ్ కొట్టి గుర్తింపు పత్రం, అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో 8వ తరగతికి చెందిన పంజాల కార్తీక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైన్నెలో నిర్వహించి న పోటీల్లో పాల్గొని ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను 8 సెకండ్ల 85 మిల్లీ సెకండ్స్ లలో కంఠస్థం చేసినట్లు తెలిపారు. దీంతో ప్రపంచ రికార్డును సృష్టించిందన్నారు. ఈ విషయాన్ని కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించి కార్తీకకు గుర్తింపు ప్రశంసాపత్రంతో పాటు అవార్డు అందజేశారన్నారు. దీనికి కృషి చేసిన ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డిని, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.
చింతకాయలు తెంపుతూ కిందపడ్డ రైతు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
దుబ్బాకటౌన్: చెట్టుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక పట్టణానికి చెందిన ఎంగారి రాజిరెడ్డి (52) వ్యవసాయం చేస్తూ భవన నిర్మాణ కార్మికుడి గా పని చేస్తున్నాడు. భార్య, పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. 3న సొంత వ్యవసాయ పొలంలో చింత చెట్టు ఎక్కి కాయలను తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజిరెడ్డిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి శనివారం రాజిరెడ్డి మృతి చెందాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక వాహనం పట్టివేత
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని వింజపల్లి శివారులోని మోయతుమ్మద వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నామని ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రశాంత్ శుక్రవారం రాత్రి వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దాడిచేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
మందుబాబులకు
జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో 24 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో శనివారం హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.24,500 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
కల్హేర్(నారాయణఖేడ్): డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 92 మందికి రూ.1.05 లక్షలు జరిమానా విధిస్తూ నారాయణఖేడ్ మున్సిఫ్ కోర్టు మెజి స్ట్రేట్ శ్రీధర్ మంథని తీర్పు వెల్లడించినట్లు సిర్గాపూర్ ఎస్‌ఐ డి.వెంకట్‌రెడ్డి శనివారం తెలిపారు. సిర్గాపూర్ మండలంలో ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన 92 మందిని కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.

బేగంపేట విద్యార్థిని ప్రపంచ రికార్డ్
Comments
Please login to add a commentAdd a comment