
ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
సంగారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ క్రాంతి కుమార్ కథనం మేరకు.. బొమ్మారెడ్డి గూడెంకు చెందిన మూడ్ తుకారం (65) ఒడీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి. ప్రస్తుతం సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి వివాహం చేశాడు. మిగితా ఇద్దరి వివాహ విషయంలో ఆర్థిక ఇబ్బందులు నెలకొని కుటుంబంలో కలహాలు ఏర్పడ్డా యి. దీంతో మనస్తాపం చెంది శనివారం బొమ్మరెడ్డి గూడెంలో చెట్టుకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య మంగ్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరేసుకొని కార్మికుడు..
హత్నూర( సంగారెడ్డి): ఉరేసుకొని కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హత్నూర మండల పరిధిలోని బోరుపట్ల గ్రామంలో శనివారం వెలుగు చూసింది. హత్నూర ఎస్‌ఐ సుభాష్ కథనం మేరకు.. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బనేశ్వర్ ము ర్ము (22) రెండుళ్లుగా బోరపట్ల గ్రామ శివారులోని ఆపెటోరియ యూనిట్–1లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తోటి కార్మికుల తో కలిసి పరిశ్రమకు సమీపంలోని గదిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనం అనంత రం కార్మికులు ఎవరి గదిలో వారు నిద్రించారు. శనివారం ఉదయం షిఫ్ట్ డ్యూటీ కి వెళ్లాల్సి ఉండగా బసవేశ్వర్ గదిలో నుంచి బయటికి రాకపోవడంతో తోటి కార్మికులు తలుపు తెరిచి చూడగా ఉరేసుకొని కనిపించాడు. మృతుడి దగ్గరి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాళ్లకల్ గ్రామంలో యువకుడు
మనోహరాబాద్(తూప్రాన్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాలగౌని శ్రీనివాస్‌గౌడ్, జయమ్మ దంపతులకు కుమారుడు వేణు(23), కూతురు ఉంది. కుటుంబ సభ్యులంతా కలిసి కొన్నేళ్లుగా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసం ఉంటూ సాగర్ ఏషియా పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వేణు స్థానిక ఓ ప్రైవేట్ పరిశ్రమలో డ్యూటీ చేస్తున్నాడు. కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పరిశ్రమకు వెళ్లగా వేణు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment