
స్పేస్ సెంటర్‌ను సందర్శించిన విద్యార్థులు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది సతీష్‌ధావన్ స్సేస్ సెంటర్(శ్రీహరికోట)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ విభాగాధిపతి డా. సీహెచ్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఇది ఇస్రో నిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగకేంద్రమని, ఏపీలోని పులికాట్ సరస్సు, బంగాళాఖా తం నడుమ శ్రీహరికోట అనే ద్వీపంలో 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు చెప్పా రు. మొదట్లో షార్‌గా పిలువబడిన దీనిని 2002 నుంచి మాజీ ఇస్రో చైర్మన్ సతీష్‌ధావన్ పేరుతో పిలుస్తారన్నారు. ఇందులో రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయని వీటి ద్వారా మన దేశం పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగ కార్యకలాపాలను నిర్వహిస్తుందని వివరించారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా లాంచ్ ప్యాడ్‌ల టెక్నాలజీ, రాకెట్ వివిధ దశల ప్రయోగాల టెక్నాలజీ తదితర అంశాలను గురించి విద్యార్థులు చక్కగా తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పర్యటనలతో విద్యార్థుల్లో శాసీ్త్రయదృక్పథం అలవడుతుందన్నారు. ఈ కేంద్రంలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ వీ. సురేందర్ తమకు ఎంతగానో సహకరించాడని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ కళాశాల అధ్యాపకులకు జ్ఞాపికను అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అధ్యాపకులను, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా.భాస్కర్, సత్యనారాయణరెడ్డి, డా.మహేశ్‌కుమార్, డా.మనోహర్, డా.భైరయ్య, డా.లీలావతి, డా.రాణి, వెంకటరమణ, కృష్ణయ్య, డా.పుణ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment