
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మునిపల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జాగ్రు మంజి (47) శనివారం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై నడుచు కుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరంపై నుంచి వాహనం వెళ్లడంతో మాంస పు ముద్దలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీపక్‌కుమార్ సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజేశ్ నాయక్ తెలిపారు.
బట్టల వ్యాపారి
దుబ్బాకరూరల్: రోడ్డు ప్రమాదంలో బట్టల వ్యాపారి మృతి చెందిన ఘటన మండలంలోని పోతారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజ్ కథనం మేరకు.. రాజన్నసిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కేదారి ముత్తయ్య(75)గ్రామంలో బట్టలు అమ్ముతూ ఉండేవాడు. శుక్రవారం బట్టలు కొనుగోలు చేసేందుకు దుబ్బాకకు వచ్చి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతడిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment