
సమస్యల పరిష్కారానికి కృషి
పటాన్‌చెరు: సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అమీన్‌పూర్‌లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... అమీన్‌పూర్ పరిధిలోని సమస్యలపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పీపుల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలరెడ్డి, కొండ లక్ష్మణ్, మహేశ్వర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
14,307 కేసుల పరిష్కారం
సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతోనే కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఇరువర్గాలు తగాదాలు పడిన కేసులను రాజీమార్గంతో స్నేహభావంతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అన్నారు. జిల్లావ్యాప్తంగా క్రిమినల్ కాంపౌండ్ కేసులు, సివిల్, మోటార్ వాహన ప్రమాద పరిహారం, విద్యుత్ వంటి కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఒక్కరోజే మొత్తం 14,307 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో
మహిళలకు భద్రత
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రతతో పాటు ప్రాధాన్యం ఉంటుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి అన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరు బస్టాండ్‌లో మహిళా కండక్టర్లను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల్లో మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్, నాయకులు సాయిలు ముదిరాజ్, రతన్ సింగ్, శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
‘కేజీబీవీ’లో జీసీడీఓ విచారణ
కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికలను చితకబాదినట్లు తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో శనివారం గర్‌ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆధికారి సుప్రియ విచారణ చేపట్టారు. విద్యాలయంలో గణితం టీచర్ సురేఖ బాలికలను పనులు చేయాలని బెదిరిస్తూ చితకబాదుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు విద్యార్థినులను సైతం చితకబాదినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జీసీడీఓ ఎంఈఓ రహీమోద్దీన్‌తో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ నివేదికను డీఈఓతో పాటు కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ మాధవి, ఎస్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి
Comments
Please login to add a commentAdd a comment