
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణఖేడ్: మహిళలతోనే కుటుంబాల ఎదుగుదల సాధ్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం ఖేడ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఇండోర్ ఆటలు, సంగీతం, నృత్య పోటీలు నిర్వహించారు. విజేతలకు తన సతీమణి అనుపమారెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లోనూ ముందుండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ స్వరూప్ షెట్కార్, దారం శంకర్, రమేష్ చౌహాన్, సంగన్న, శివరాథోడ్, శ్రీకాంత్‌రెడ్డి, ఆయా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడ్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ జగ్జీవన్, శానిటరీ అధికారి శ్రీనివాస్ సన్మానించారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment