
కార్మికులకు ‘ఎంఆర్‌ఎఫ్’ షాక్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘2021 మార్చి 29న ఏడాది పాటు శిక్షణ కోసం మిమ్మల్ని తీసుకున్నాం. ఆ కాలంలో మీరు పని నేర్చుకోలేదు. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక మాద్యం నేపథ్యంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం. దేశంలోని ఇతర ప్లాంట్లలో అవసరమున్న చోట పని చేయడానికి ఆసక్తి ఉంటే వారం రోజుల్లో అభిప్రాయం తెలపండి’ అని మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్‌ఎఫ్ (ఏపీఎల్) ప్లాంట్లో పనిచేస్తున్న 350 మందికిపైగా కార్మికులకు యాజమాన్యం ఈనెల 7న నోటీసులు అందజేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. రిక్రూట్‌మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మనెంట్ చేయాలని కోరిన పాపానికి ఉద్యోగంలో నుంచి తీసేసి పరిశ్రమ యాజమాన్యం నియంతృత్వం ప్రదర్శిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్మికులు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment